'Chalo Secretariat' Poster release by Telangana State all Universities Part Time Lecturers
చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ.
15/April / 2025
తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 చలో సెక్రటేరియట్ కార్యక్రమo పోస్టర్ ఆవిష్కరణ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మరియుతెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలు కాకతీయ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం,శాతవాహన విశ్వవిద్యాలయం,సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం,మెదక్ పీజీ సెంటర్,లలోగోడపత్రికను ఆవిష్కరించారు.,యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలి,నియామకాల్లో పార్ట్ టైం టీచర్ల ఎక్స్పీరియన్స్ కి వెయిటేజ్ ఇవ్వాలి.నియామకాల్లో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి.అనే డిమాండ్లతో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతినిధులు పేర్కొన్నారు.యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాల్ని పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమేశ్వర్ బోనకుర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని యూనివర్సిటీల పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment